Share News

బంగారు రథంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:45 AM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు రథంపై ఊరేగారు.

 బంగారు రథంపై ప్రహ్లాదరాయలు
బంగారు రథంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు రథంపై ఊరేగారు. బుధవారం అషాఢ చతుర్దశి శుభ దినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవ్రేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు కవచంతో శోభాయమానంగా అలంకరించారు. పీఠాఽఽధిపతి పూర్ణ బోధ పూజ మం దిరంలో మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య బంగారు రథంపైౖ వజ్రాలు పొదిగిన ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. ఉత్సవమూర్తికి ఊంజలసేవ నిర్వహించి హారతులిచ్చారు. భక్తులను పీఠాధిపతి సుబు ఽఽధేంద్ర తీర్థులు ఆశీర్వాదించారు.

Updated Date - Jul 10 , 2025 | 12:45 AM