Share News

బంగారు రథంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:54 AM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు రథంపై విహారిం చారు.

బంగారు రథంపై ప్రహ్లాదరాయలు
బంగారు రథంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు రథంపై విహారిం చారు. మంగళవారం ద్వాదశి శుభ దినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజామునుంచే బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. బృందావనానికి క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం చేసి వెండి, బంగారు, పట్టు వస్ర్తాలతో అలంకరించారు. పూర్ణబోధ పూజ మందిరంలో మూలరాములకు, జయ రాములు, దిగ్విజయరాములకు కనకాభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య స్వర్ణ రథంపై వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరే గించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి పూజలు చేశారు. మఠం పీఠాధిపతి భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

ధార్మిక పర్యటనకు వెళ్లిన పీఠాధిపతి: రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ధార్మిక పర్యటనలో భాగంగా మంగళ వారం కర్ణాటకలోని హావేరి జిల్లా హొసరిత్తికి బయలుదేరి వెళ్లారు. బుధవారం జరిగే శ్రీమఠం పూర్వ పీఠాధిపతి ధీరేంద్ర తీర్థుల మధ్యారా ధన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పర్యటన ముగించుకొని శనివారం ఉదయం మంత్రాలయానికి చేరు కుంటారని ఏఏఓ మాధవశెట్టి, మఠం మేనేజర్‌ వెంకటేష్‌ జోషి తెలిపారు.

Updated Date - Mar 12 , 2025 | 12:54 AM