ఉత్కంఠగా పీఆర్ ఉద్యోగుల కౌన్సెలింగ్
ABN , Publish Date - May 28 , 2025 | 12:11 AM
రాయలసీమ పరిధిలోని పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్ ఉత్కంఠగా సాగింది
కొందరికి బదిలీ.. మరికొందరికి యథాస్థానం
నంద్యాల, మే 27(ఆంధ్రజ్యోతి):
రాయలసీమ పరిధిలోని పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్ ఉత్కంఠగా సాగింది. మంగళవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ ఈఎన్‌సీ బాలునాయక్‌తో పాటు రాయల సీమ పరిధిలోని (జోన్-4)కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాల ఎస్‌ఈలు, ఈఈల ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయం త్రం వరకు కౌన్సెలింగ్ ఉత్కంఠగా సాగింది. ముందుగా ఆయా జిల్లాల పరిధిలో ఐదేళ్లు పూర్తయిన డీఈఈలు, ఏఈలు, ఏఈ ఈలతో పాటు తదితర విభాగాల ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహిం చారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పీఆర్‌ఐ డివిజన్ డీఈఈగా పనిచేస్తున్న ధనిబాబును కర్నూలు క్యూసీ-1 డీఈఈగా బదిలీ చేశారు. ఇక్కడ క్యూసీ-1 డీఈఈగా పనిచేస్తున్న హెచ్‌డీ వీరన్నను నందికొట్కూరు పీఐయూకు బదిలీ చేశారు. నంద్యాల క్యూసీ విభాగం డీఈఈగా పనిచేస్తున్న కేఎస్‌ఆర్ మోహన్‌రావు నంద్యాల పీఐయూకు బదిలీ చేశారు. అదేవిధంగా రిక్వెస్ట్ బదిలీ కింద నంద్యాల డీపీఆర్‌ఈఏ పీఏగా పనిచేస్తున్న డీఈఈ సుధాకర్‌రెడ్డిని క్యూసీ విభాగం నంద్యాలకు, కర్నూలు ఎస్‌ఈ పీఏగా పనిచేస్తున్న డీఈఈ సుధాకర్‌బాబును నంద్యాల పీఆర్‌ఐకు బదిలీ చేశారు. అనంతపురం జిల్లాలో ఐదేళ్లు పూర్తయిన నలుగురు డీఈఈలు ఉండగా.. వీరిలో త్వరలో పదవీ విరమణ ఉండటంతో అనంతపురం పీఐయూ డీఈఈగా పనిచేస్తున్న భరత్‌ప్రకాష్‌రెడ్డి, అనంతపురం క్యూసీ డీఈఈ రవీంద్రను యథాస్థానాల్లో ఉంచారు. అదేవిధంగా గుత్తి డీఈఈగా పనిచేస్తున్న డీఎల్ మురళీతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి పీఐయూ డీఈఈగా పనిచేస్తున్న మధుప్రకాష్ రెడ్డి ఆ శాఖ ఉద్యోగుల యూని యన్‌లో ఉండటంతో యథాస్థానాల్లో ఉంచారు. కడప జిల్లాలోని ఎస్‌ఈ పీఏగా పనిచేస్తున్న డీఈఈ రాముడిని జమ్మలమడుగు క్యూసీ డివిజన్‌కు బదిలీ చేశారు.
కర్నూలు జిల్లాలో ఐదేళ్లు పూర్తయిన ఏఈలు ఏడుగురు ఉండగా.. వీరిలో ఒకరిని మాత్రమే బదిలీ చేసి మిగిలిన వారిని యథాస్థానాల్లో ఉంచారు. అనంతపురం జిల్లాలో ఏడుగురు ఏఈలు ఉండగా. ముగ్గురు ఏఈలను బదిలీ చేసి.. మిగిలిన నలుగురు ఏఈలను యథాస్థానాల్లో ఉంచారు. కడప జిల్లాలో ఆరుగురు ఏఈలు ఉండగా.. ఇద్దరు ఏఈలను బదిలీ చేసి మిగిలిన నలుగురిని అక్కడే పోస్టింగ్ కల్పించారు. రిక్వెస్ట్ బదిలీ కింద కర్నూలు జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఆరుగురు, కడపలో ఆరుగురు, చిత్తూరులో ఒకరు ఏఈల చొప్పున బదిలీ చేశారు.
ఇద్దరు సూపరింటెండెంట్ల బదిలీ
అనంతపురం పీఆర్ ఎస్‌ఈ ఆఫీస్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గీతమ్మను నంద్యాలకు, ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెం డెంట్ రమాదేవిని అనంతపురానికి బదిలీ చేశారు. అదేవిధంగా టీవో(టెక్నికల్ ఆఫీసర్స్) అనంతపురం పీఆర్‌ఐ డివిజన్‌లో టీవోగా పనిచేస్తున్న భానుప్రకాష్‌ను నంద్యాలకు బదిలీ చేయగా.. చిత్తూరులో టీవోగా పనిచేస్తున్న అరుంధతిని అనంతపురానికి బదిలీ చేశారు.