Share News

శ్రీశైలంలో ముమ్మరంగా విద్యుదుత్పత్తి

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:35 AM

శ్రీశై లం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో 32.135 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

శ్రీశైలంలో ముమ్మరంగా విద్యుదుత్పత్తి

డ్యాంలో నీటినిల్వ సామర్థ్యం 202 టీఎంసీలు

శ్రీశైలం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): శ్రీశై లం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో 32.135 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. శ్రీశైలం డ్యాంకు వరద పెరగడంతో జలాశయం ఇంజనీర్లు ఆదివారం సాయంత్రానికి 10గేట్లను ఒక్కొక్కటి పది అడుగుల ఎత్తు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. జలాశయం స్పిల్‌వే గుండా 2,69,730 క్యూసెక్కులు సాగర్‌కు సాగనంపుతున్నారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 882 అడుగులుగా ఉండగా, నీటినిల్వ సామర్థ్యం 202టీఎంసీలుగా నమోదైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల స్పిల్‌వే, విద్యుత్‌ ఉత్పత్తి, సుంకేసుల నుంచి మొత్తం 2,60,020 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. వరదతో శ్రీశైలం డ్యాం జలకళను సంతరించుకుంది.

Updated Date - Sep 01 , 2025 | 12:35 AM