Share News

పొట్టి శ్రీరాములు సేవలు ఎనలేనివి

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:54 PM

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన పొట్టిశ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

పొట్టి శ్రీరాములు సేవలు ఎనలేనివి
డోనలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన పొట్టిశ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పాతపేట పూల మార్కెట్‌ సమీపంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల పూలమాలలు వేసి నివాళులర్పించా రు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన కోట్రికే హరికిషన, ఆర్డీవో కేపీ నరసింహులు, తహసీల్దార్‌ రవికు మార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: పట్టణంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మండల అధికారులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జ్యోతి రత్నకుమారి, ఎంపీడీవో నూర్జాహాన, కమిషనర్‌ కిషోర్‌ పాల్గొన్నారు. అలాగే ఆవోపా సంఘం అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, అపూస్మ సంఘం అధ్యక్షుడు అమీర్‌బాషా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు.

కోవెలకుంట్ల: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి తహసీల్దార్‌ పవనకుమార్‌ రెడ్డి, ఎంపీడీవో వరప్రసాద్‌ రావులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే శ్రీవాసవి బొమ్మిడాల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ అధ్యక్షతన పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు.

చాగలమర్రి: రాష్ట్ర విభజన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు లక్ష్మణబాబు అన్నారు. సోమవారం చాగలమర్రి గ్రామంలోని గాంధీ సెంటర్‌ వద్ద పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ వార్డు సభ్యుడు శంకర సుబ్బారావు, టీఎనటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, ఆర్యవైశ్యులు లక్ష్మీనారాయణ, మల్లికార్జున, ప్రసాద్‌, వినోద్‌, రవికుమార్‌, శ్రీనివాసులు, శేఖర్‌ పాల్గొన్నారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో తాహి ర్‌హుసేన, ఏవో రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు.

శిరివెళ్ల: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన పొట్టిశ్రీరా ములు సేవలు చిరస్మరణీయ మని తహసీ ల్దార్‌ విజయశ్రీ, ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప అన్నారు. పొట్టిశ్రీ రాములు వర్ధంతి సందర్భంగా శిరివెళ్లలోని తహసీల్దార్‌ కార్యాల యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ప్యాపిలి: స్థానిక మండల పరిషత కార్యాలయంలో పొట్టి శ్రీరా ములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏఈలు ప్రభాకర్‌రెడ్డి, వినయ్‌కుమార్‌, ఏపీఎం క్రిష్ణమూర్తి, ఏపీవో రవీంద్ర, ఎంఈవో వెంకటేశ్వరనాయక్‌ పాల్గొన్నారు.

బనగానపల్లె: పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో పొట్టిశ్రీరా ములు వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు సుబ్బనారాయణ, పట్టణ అధ్యక్షులు గాథంశెట్టి వేణుగో పాల్‌, శ్రీరామ వెంకటసుబ్రహ్మణ్యం, కేతేపల్లి శివచంద్రయ్య, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షుడు టంగుటూరు శీనయ్య, నూకల విజయకుమార్‌, ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు గుండా సుప్రజ, మురళీధర్‌ నివాళి అర్పించారు.

కొలిమిగుండ్ల: స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో పొట్టిశ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు. ఎంపీడీవో దస్తగిరి బాబు, డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళీశ్వగౌడ్‌, తహసీల్దార్‌ శ్రీనివా సులు, ఎంఈవో అబ్దుల్‌కలాం, పీఆర్‌ ఏఈ అన్వర్‌భాషా, టీడీపీ ప్రచార కార్యదర్శి కోటపాడు శివరామిరెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బేతంచెర్ల: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పొట్టిశ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి తహసీల్దార్‌ నాగమణి, ఎంపీడీవో ఫజిల్‌ రెహ్మాన, అధికారులు నివాళి అర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ హరిప్రసాద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మారుతి, హౌసింగ్‌ ఏఈ శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:54 PM