సమస్యల పరిష్కారానికి సానుకూలత
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:24 AM
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఉదయానంద హోటల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
ఆరు అంశాలపై ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు
ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్
నంద్యాల రూరల్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఉదయానంద హోటల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి 6 అంశాలపై చర్చించి సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే ఉత్తర్వులు కూడా అధికారులు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో 32 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. పెన్షనర్లకు కాంటమైజేషన్ 3 శాతం, ఇంటి బాడుగలకు 4 శాతం కోత విధించిందన్నారు. కూటమి ప్రభుత్వం రూ. 12 వేల కోట్ల పాత బకాయిలు చెల్లించిందన్నారు. 2022 నుంచి 2024 సరెండర్ లీవ్‌లకు బకాయిలు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు. 25 లక్షల కుటుంబాల ఉద్యోగుల కుటుంబాలకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని, పేమెంట్, ఉద్యోగుల హెల్త్‌కార్డుకు ఇన్సూరెన్స్ అనుసంధానంలో, నూతన వైఽధ్యులను నియమించడంలో, సీలింగ్ పరిమితి పెంచడంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యద ర్శి జవహర్ పాల్గొన్నారు.