Share News

కష్టపడి పని చేసిన వారికే పదవులు

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:44 AM

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే నామినెటెడ్‌ పదవులు వస్తాయని కోడు మూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు రామలింగారెడ్డి మండల నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

కష్టపడి పని చేసిన వారికే పదవులు
మాట్లాడుతున్న కోడుమూరు టీడీపీ పరిశీలకుడు రామలింగారెడ్డి

ఎంపీ, ఎమ్మెల్యే సిఫారసులుతో పదవులు రావు

నేరుగా హైకమాండ్‌ నుంచే..

25లోపు కమిటీల ఎంపిక పూర్తి కావాలి

కోడుమూరు టీడీపీ పరిశీలకుడు రామలింగారెడ్డి

కర్నూలు రూరల్‌ జూన 16(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే నామినెటెడ్‌ పదవులు వస్తాయని కోడు మూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు రామలింగారెడ్డి మండల నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫార సు లు చేస్తే పదవులు రావని అన్నారు. సోమవారం కర్నూలు మండల ప్రజా పరిషత సమావేశ భవనంలో కోడుమూరు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పార్టీ పరిశీల కుడు రామలింగారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీ సీబీ చెర్మన విష్ణువర్ధనరెడ్డి, పార్టీ మరో పరిశీలకుడు బత్తిన వెంకట రాముడు, మల్లికార్జునరెడ్డి హాజరయ్యారు. రామలింగారెడ్డి మాట్లాడు తూ పార్టీకి పనిచేయకపోతే న్యాయం జరగదని, పనిచేసిన వారికి రాష్ట్ర హైకమాండే నేరుగా పదవులు కేటాయిస్తుందని సూచించారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు రావని, వారితో టీడీపీకి పనిచేయించు కోవాలని ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కార్యకర్త లకు ఆయన స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీలోపు మండల, క్లస్టర్‌, గ్రామ, బూత స్థాయి కమిటీల ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించారు. కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం జరగాలంటే అందరం కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి అర్హులైన తల్లుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు తల్లికి వందనం నగదు జమచేశారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికి వరకు రూ.20కోట్ల వరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని, వాటితో పాటు అనేక మంది రోగులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం చేసిన ఇలాంటి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రామ స్థాయిలో విఫలమయ్యారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం విష్ణువర్దనరెడ్డి తాను కలిసి సీఎం చంద్రబాబు మాట్లాడి మరిన్ని నిధులను విడుదల చేయించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు, కోడుమూరు, సి.బెళగల్‌, గూడూరు, మండల టీడీపీ కన్వీనర్లు బోయ బుర్ర వెంకటేష్‌ నాయుడు, రామకృష్ణారెడ్డి, బోయ చంద్రశేఖర్‌ నాయు డు, జగ్గుల సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:44 AM