ఢిల్లీ పేలుళ్ల ఘటనతో.. పోలీసు యంత్రాంగం అప్రమత్తం
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:26 PM
ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ పేలుడు జరిగిన నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
స్వయంగా తనిఖీలు చేసిన ఎస్పీ
కర్నూలు క్రైం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ పేలుడు జరిగిన నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. జిల్లాలో ఏకకాలంలో ముమ్మరంగా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. స్థానిక గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు. భారీ పేలుడు సంఘటన నేపథ్యంలో పోలీసు బృందాలు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.