నిమజ్జనానికి భారీ బందోబస్తు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:57 PM
పట్టణంలో ఆదివారం గణేష్ నిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఏఎస్పీ హుసేన్‌పీరా, డీఎస్పీ హేమలత తెలిపారు.
ఏఎస్పీ హుసేన్‌పీరా, డీఎస్పీ హేమలత
ఆదోని, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఆదివారం గణేష్ నిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఏఎస్పీ హుసేన్‌పీరా, డీఎస్పీ హేమలత తెలిపారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో పమావుజవం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఊరేగింపులో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణకు అయిదుగురు డీఎస్పీలు, 33 మంది సీఐలు, 47 మంది ఎస్‌ఐలు, 818 మంది పోలీసులు విదులు నిర్వహిస్తా రన్నారు. మఫ్టీలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఆర్ట్స్ కళాశాల నుంచి వచ్చే విగ్రహాలు, తిక్కస్వామి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, చందాసాబ్ దర్గా మీదుగా నిర్మల్ థియేటర్, శ్రీనివాసభవన్, మేదర్‌గేరి మీదుగా ఫ్లై ఓవర్‌బ్రిడ్జి పై నుంచి చిన్నహరివాణం గ్రామ సమీపాన ఉన్న ఎల్‌ఎల్‌సీ కెనాల్‌కు తీసుకెళ్తారన్నారు. భక్తులు, నిర్వాహకులు పోలీసుల సూచనలను పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. బాణసంచాలు కాలుస్తూ ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.