పోలవరం-బనకచర్ల సాగునీటి ప్రాజెక్టు మరో కాళేశ్వరం
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:36 PM
గోదావరి జలాలను కృష్ణాజలాలతో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన తలకెత్తుకున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరం అవుతుందని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు
నందికొట్కూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలను కృష్ణాజలాలతో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన తలకెత్తుకున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరం అవుతుందని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వివరాలను పరిశీలించాక అది ఒక పనికి మాలిన ప్రాజెక్టు అని నిర్ధారణకు వచ్చామన్నారు. మంగళవారం నంద్యాల జిల్లాలో ‘సీమ సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన చేసిన ఆలోచనాపరుల వేదిక’ కమిటీ సభ్యులు పర్యటించారు. పగిడ్యాల మండలంలోని ము చ్చుమర్రి ఎత్తిపోతల పథకం, నందికొట్కూరు మండలంలోని మల్యాల ఎత్తిపోతల పథకం, జూపాడుబంగ్లాలోని పోతులపాడు ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైతు సంఘం సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, అక్కినేని భవానీప్రసాద్, జొన్నలగడ్డ రామారావు, నల్లబోతు చక్రవర్తి, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల సాధన కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, రైతు సంఘం నాయకుడు బొజ్జా దశరథరామిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర నాయకుడు లక్ష్మీనారాయణ మాట్లా డుతూ ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగా ణ ప్రభుత్వం విషం చిమ్ముతోందని ఆరోపించారు. మల్యాల ఎత్తిపోతల ద్వారా జలచౌర్యానికి పాల్పడుతున్న దొంగలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తే ఏపీ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. అక్కినేని భవాణి ప్రసాద్ మాట్లాడుతూ 30 ఏళ్లకాలంలో గాలేరు నగ రి, హంద్రీనీవా ప్రాజెక్టులపై కోట్ల రూపాయలను ఖర్చు చేసినా కూడా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి మాట్లాడుతూ బచావత్ ట్రిబునల్, రాష్ట్ర విభజన చట్టం ద్వారా రాయలసీమకు సాగునీటి కోసం హక్కుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఆ మేరకు సీమకు సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు మాట్లాడు తూ ‘సీమ’కు కృష్ణాజలాలను తరలించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.