విభజన హామీలు అమలు చేయని ప్రధాని
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:20 AM
రాష్ట్రానికి విభజన హమీలు అమలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన దేనికోసమని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య సూటిగా ప్రశ్నించారు.
పర్యటనతో ప్రజాధనం వృథా తప్ప ప్రయోజనం లేదు
నగరంలో వామపక్షాల భారీ ర్యాలీ
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి విభజన హమీలు అమలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన దేనికోసమని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోడీ జిల్లా పర్యటనను నిరసిస్తూ బుధవారం సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షతన నగరంలో జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ వరకు నల్లజెండాలతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్రానికి ద్రోహం చేసిన నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గడం వల్ల రూ.15 వేలు మిగులుతుందని ప్రధాని, ముఖ్యమంత్రి అంటు న్నారని, అదే నిజమైతే ఈ ఎనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కకిరి రూ.15 వేల భారం వేశారని అన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందో లేదో కానీ ప్రధాని మోదీ పర్యటన వల్ల కోట్ల రూపాయలు ప్రజా ధనం మాత్రం వృథా అవుతోందని అన్నారు. రాష్ట్ర రాజఽ దాని నిర్మాణం కోసం నిధులు ఇవ్వని మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని విమర్శించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయకుండా సంబరాలు చేసుకోవడంం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన జిల్లా అయినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం, కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు నిధులు కేటాయించడం లేదని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2013లో కోడుమూరు నియోజకవర్గంలో శంకుస్థాపన చేసి నత్తనడక నడుస్తున్న రైల్వే వ్యాగన్ వర్క్ షాపును పూర్తి చేసి యువకులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. విభజన హమీలపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు రాఘవేంద్ర, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మల్లికార్జున, నాగరాజు, సీపీఎం నగర కార్యదర్శులు టి.రాముడు, రాజశేఖర్, సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, నిర్మల, రాధాకృష్ణ పాల్గొన్నారు