Share News

జీతాలు ఇవ్వండి సారూ..!

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:01 AM

తొమ్మిది నెలలుగా తమకు జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని స్వచ్ఛభారత్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీతాలు ఇవ్వండి సారూ..!
మద్దికెరలో విధులు నిర్వహిస్తున్న కార్మికురాలు

తొమ్మిదినెలల నుంచి ఇవ్వడం లేదు

ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్న స్వచ్ఛభారత్‌ కార్మికులు

మద్దికెర, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తొమ్మిది నెలలుగా తమకు జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని స్వచ్ఛభారత్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది ఉండగా వారికి జీతాలు ఇస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్‌ కింద మరో 18 మంది కార్మికులు పని చేస్తున్నారు. మద్దికెరలో 20వేల జనాభా ఉండగా, 18 వార్డులు ఉన్నాయి. రోజూ చెత్తను సేకరించి, చెత్త నుంచి సంపద కేంద్రాలకు తరలిస్తున్నామని జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ నిధులు రాలేదు

పంచాయతీలో నిధుల కొరత ఉంది, ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. స్వచ్ఛభారత్‌ కార్మికులకు త్వరలోనే జీతాలు ఇచ్చేందుకు బిల్లులు పెడతాం - శివకుమార్‌, పంచాయతీ కార్యదర్శి

Updated Date - Sep 03 , 2025 | 12:01 AM