ఓటరు నమోదుకు సహకరించాలి
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:12 AM
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరిం చాలని కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కార్పొరేషన కమిషనర్ రవీంద్ర బాబు అన్నారు.
కర్నూలు నియోజకవర్గ ఆర్వో రవీంద్రబాబు
కర్నూలు న్యూసిటీ, జూన 6(ఆంధ్రజ్యోతి): 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరిం చాలని కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కార్పొరేషన కమిషనర్ రవీంద్ర బాబు అన్నారు. శుక్రవారం నగర పాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషనకు బీఎల్‌వో ప్రభుత్వం తరపున ఉంటారని, రాజకీయ పార్టీల తరపున బీఎల్‌వో ద్వారా అర్హులైన వారితో దరఖాస్తు చేయించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఆనలైన ద్వారా ఎప్పుడైనా ఓటరు నమోదు చేయించుకోవచ్చని ప్రతినిధులకు తెలిపారు. ఆనలైన ఓటరు నమోదుకు సంబంధిత ఓటర్ ఫోన నెంబ రుకు వనటైం పాస్‌వర్డ్ వస్తుందని, దాని ద్వారా ఓటరు నమోదు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దారు డబ్ల్యూ ధనుంజయ, సూపరింటెండెంట్ సుబ్బన్న పాల్గొన్నారు.