Share News

‘పది’ ఉత్తీర్ణతకు ప్రణాళికలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:29 AM

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పాఠ్యాంశాలు బోధించాలని డీఈవో శామ్యూల్‌ పాల్‌ సూచించారు.

‘పది’ ఉత్తీర్ణతకు ప్రణాళికలు
మాట్లాడుతున్న డీఈవో శామ్యూల్‌ పాల్‌

హెచ్‌ఎంల సమావేశంలో డీఈవో శామ్యూల్‌పాల్‌

మంత్రాలయం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పాఠ్యాంశాలు బోధించాలని డీఈవో శామ్యూల్‌ పాల్‌ సూచించారు. ఆదివారం కేజీబీవీలో మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మధ్యాహ్న భోజనం, డ్రాపౌట్లు, బడి ఈడు గల పిల్లలు, పదో తరగతి ఉత్తీర్ణత వంటి అంశాలపై చర్చించారు. డీఈవో మాట్లాడుతూ గణితం, ఆంగ్లం, సైన్స్‌ వంటి సబ్జెక్టులపై ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వెనుకబడిన పిల్లలను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులతో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగాలన్నారు. సమావేశంలో ఎంఈవో రాగన్న, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ శాంతి, హెచ్‌ఎంలు భోజరాజు, విఠోభరావు, లచ్చప్ప, వెంకటేష్‌, రామ్మోహన్‌, భూషణం, రంగనాథ్‌, రంగస్వామి, రామ్మోహన్‌, సీఆర్‌పీలు భీమేష్‌, బంగారప్ప పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:29 AM