Share News

రాక్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:01 AM

అధునాతన టెక్నాలజీతో రాక్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

రాక్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు
పరిశీలిస్తున్న అధికారులు

కొండ చరియలను పరిశీలించిన అధికారులు

శ్రీశైలం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అధునాతన టెక్నాలజీతో రాక్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఆర్డీవో నాగజ్యోతి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఫారెస్టు రేంజర్‌ పరమేశులు, ఏపీ టూరిజం జీఎం పెంచల్‌రెడ్డి, పోలీసు ఇన్‌స్పెక్టర్లు ప్రసాదరావు, చంద్రబాబు శ్రీశైలం క్షేత్రానికి వచ్చే ఘాట్‌ రోడ్లను పరిశీలించారు. డ్యాంసైట్‌ నుంచి లింగాలఘాట్‌ వెళ్లే దారి, పాతాళగంగ రోప్‌ మార్గంలో వర్షాకాలంలో కొండచరియలు, బండరాళ్లు విరిగి పడుతున్నాయని వారు పేర్కొ న్నారు. వాహనాల రాకపోకలకు, ప్రమాదాల బారి నుంచి యాత్రి కులకు రక్షణ కల్పించే దిశగా రాక్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నివేదికలు రూపొందించి కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Nov 30 , 2025 | 12:01 AM