Share News

మెరుగైన పారిశుధ్యానికి ప్రణాళికలు: కమిషనర్‌

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:17 AM

నగరంలో మెరుగైన పారిశుధ్యానికి వార్డు స్థాయిలో ప్రణాళికలు రూపొందిం చుకుని, అధికారుల సమన్వయంతో అమలు చేయాలని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాత అన్నారు.

మెరుగైన పారిశుధ్యానికి ప్రణాళికలు: కమిషనర్‌
మాట్లాడుతున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): నగరంలో మెరుగైన పారిశుధ్యానికి వార్డు స్థాయిలో ప్రణాళికలు రూపొందిం చుకుని, అధికారుల సమన్వయంతో అమలు చేయాలని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాత అన్నారు. బుధవారం స్థానిక నగర పాలక సమావేశ భవనంలో పారిశుధ్య, ఇంజనీరింగ్‌, నోడల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి ఉదయ్‌ సింగ్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అవగాహన కల్పిం చారు. కమిషనర్‌ మాట్లాడుతూ వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలని, పూడికతీత పనులు, చెత్తకుప్పల తొలగింపు కార్యక్రమా లను పక్కాగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిష నల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, శానిటేషన సూపర్‌వైజర్‌ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:17 AM