కొత్త ఫుడ్ స్ట్రీట్‌కు రూపకల్పన
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:22 AM
నగరంలోని అవుట్ డోర్ స్టేడియం రహదారిలో కొత్త ఫుడ్‌స్ట్రీట్ ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగం సిద్ధం చేశారు.
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని అవుట్ డోర్ స్టేడియం రహదారిలో కొత్త ఫుడ్‌స్ట్రీట్ ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు అలాగే సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు తాజా రుచులు అందింజేందుకు సిద్దమవుతు న్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కాకుండా మూవబుల్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు నగరంలోని మరో 3 చోట్ల కూడా ఫుట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులు సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్ 7386036167, డిప్యూటీ సిటీ ప్లానర్ వెంకటరమణను 8008868734 నంబర్లలో అధికారులను సంప్రదించాలని సూచించారు.