పందులను దూరంగా తరలించాలి: కమిషనర్
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:18 AM
పందులను పట్టణానికి దూరంగా తరలించాలని నగర కమిషనర్ హరిప్రసాద్ పందుల యజమానులకు సూచించారు.
బేతంచెర్ల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పందులను పట్టణానికి దూరంగా తరలించాలని నగర కమిషనర్ హరిప్రసాద్ పందుల యజమానులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో పందుల యజమానులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ హరిప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో పందులు సంచరిస్తుండ టంతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వచ్చినందున పందుల యజమానులు 15 రోజుల్లోపు వాటిని ఊరికి దూరంగా తరలించాలని తెలిపారు. పందుల యజమానుల అభ్యర్థన మేరకు 30 రోజుల గడువు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో మేనేజర్ సువర్ణ లక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున, ఇనచార్జి శానిటరీ ఇన్సపెక్టర్ మధు కుమార్, మేస్త్రీలు రమణ, కిరణ్, విష్ణు పాల్గొన్నారు.