Share News

పంటలపై పందుల దాడి

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:03 AM

జూపాడు బంగ్లా గ్రామ సమీ పంలో ఉన్న మొక్కజొన్న పంటలపై పందులు దాడి చేసి నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు నష్టపోతున్నారు.

పంటలపై పందుల దాడి
జూపాడుబంగ్లాలో మొక్కజొన్నను నాశనం చేస్తున్న పందులు

రైతులకు తీవ్ర నష్టం

పందులను కట్టేసుకోవాలని గ్రామపెద్దల తీర్మానం

జూపాడుబంగ్లా, ఆగస్టు 3 (ఆంధ్ర జ్యోతి): జూపాడు బంగ్లా గ్రామ సమీ పంలో ఉన్న మొక్కజొన్న పంటలపై పందులు దాడి చేసి నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు నష్టపోతున్నారు. గ్రామపెద్దలు పందుల యజమానులను పిలి పించి పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. పందులను బయటికి వదిలేయడంతో రైతులు తీవ్ర నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారని సమావేశంలో లేవనెత్తారు. రైతులకు పంట నష్టపరిహారం అందిస్తారాంటూ పందుల యజమానుల ను అడిగారు. ఎక్కడైనా కంచె ఏర్పాటు చేసుకుని పందు లను బంధించి పెంచుకోవాలని సూచించారు. పందులు ఎక్కువగా ఉన్న కారణంగా పంటలపై దాడులు చేస్తున్నాయని నాలుగురోజుల్లో అమ్మేసుకుంటామని, కొన్నింటిని పెట్టుకుని మేపుకుంటూ కట్టేసుకుంటామని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ బాలయ్య, గ్రామపెద్దలు పెద్దన్న, సైఫుద్దీన్‌, సుధాకర్‌, రవికుమార్‌ యాదవ్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 01:03 AM