Share News

అందరికీ ఫోన్ల రికవరీ

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:53 PM

సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికీ వారి ఫోన్లు అందజేశామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు.

అందరికీ ఫోన్ల రికవరీ

669 ఫోన్లు అందజేశాం

ఎస్పీ విక్రాంత్‌

పోలీసులను అభినందనలు

కర్నూలు క్రైం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికీ వారి ఫోన్లు అందజేశామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో మూడవ మొబైల్‌ రికవరీ మేళాను నిర్వహిచారు. ఎస్పీ ఈ కార్యక్రమానికి హాజరై బాధితులకు ఫోన్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు సైబర్‌ ల్యాబ్‌ పోలీసులు రూ.1.20కోట్లు విలువచేసే 669 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి రికవరీ చేసేందుకు కృషిచేసిన ప్రతిఒక్క పోలీసులను అభినందించారు. ఈ ఏడాది మూడోసారి మొబైల్‌ రికవరీ మేళా చేపట్టామన్నారు. రికవరీలో కర్నూలు డీఎస్పీ కార్యాలయం అటాచ్‌మెంటులో పనిచేస్తున్న శేఖర్‌బాబు 96 మొబైల్స్‌, ఆదోని టూటౌన్‌ పీఎ్‌సకు చెందిన నాగరాజు 30, ఇస్వి పీఎ్‌సకు చెందిన రామచంద్ర 16 మొబైల్స్‌ రికవరీ చేయడంతో వారిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. మొబైల్స్‌ అం దుకున్న బాధితులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్‌, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, నాగరాజరావు, శివశంకర్‌, సైబర్‌ ల్యాబ్‌ సీఐ వేణుగోపాల్‌, టెక్నికల్‌ టీం పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 11:53 PM