Share News

పీహెచ్‌సీ వైద్యుల సమ్మె బాట

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:49 AM

): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మెబాట పట్టడంతో గ్రామాల్లో వైద్యసేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 35 పీహెచ్‌సీలు ఉండగా, రోగులు ఓపీ సేవల కోసం వస్తుంటారు.

పీహెచ్‌సీ వైద్యుల సమ్మె బాట
డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వైద్యులు

ఇన్‌ సర్వీస్‌ పీజీ కోటా పెంచాలని డిమాండ్‌

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మెబాట పట్టడంతో గ్రామాల్లో వైద్యసేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 35 పీహెచ్‌సీలు ఉండగా, రోగులు ఓపీ సేవల కోసం వస్తుంటారు. ఇన్‌ సర్వీస్‌ పీజీ కోటా పునరుద్దరించాలని కోరుతూఐదు రోజులుగా ఏపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ (ఏపీపీహెచ్‌సీడీఏ) పిలుపు మేరకు జిల్లాలోని దాదాపు 90 మంది వైద్యులు సమ్మెలో ఉన్నారు. గతంలో లాగనే పీహెచ్‌సీ వైద్యులకు పీజీ కోర్సుల ప్రవేశాల్లో 25 శాతం కోటా ఇవ్వాలని డాక్టర్స్‌ అసోసి యేషన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డా.వి.మనోజ్‌, జాయింట్‌ సెక్రటరీ డా.మిధున్‌ కుమార్‌, డా.ఇబ్రహీం డిమాండ్‌ చేశారు. కాగా సమస్యల పరిష్కారానికి వైద్యులు విజయవాడకు తరలివెళ్లారు. మరోపక్క సంఘం నాయకులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది.

Updated Date - Oct 04 , 2025 | 12:49 AM