Share News

పెట్రోల్‌ బంకు పరిశీలన

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:28 AM

19వ వార్డు జొహరాపురం రోడ్డులో నగర పాలక సంస్థ, ఇండియన ఆయిల్‌ కార్పొరేషన సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోలు బంకు పనులను కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ బుధవారం పరిశీలించారు.

పెట్రోల్‌ బంకు పరిశీలన
పెట్రోల్‌ బంకును పరిశీలిస్తున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): 19వ వార్డు జొహరాపురం రోడ్డులో నగర పాలక సంస్థ, ఇండియన ఆయిల్‌ కార్పొరేషన సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోలు బంకు పనులను కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పాలక ఆధ్వర్యంలో త్వరలో మరో పెట్రోల్‌ పంప్‌ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దామోదరం సంజీవయ్య పార్కులో సౌకార్య లపై స్థానికులను ఆరా తీశారు. ఆయన వెంట ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన సూపర్‌వైజర్‌ నాగరాజు, డీఈఈ నరేష్‌, ఏఈ జనార్దన, శానిటరీ ఇన్సపెక్టర్లు ఉన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:28 AM