Share News

అర్జీలను గడువులోగా పరిష్కరించాలి: జేసీ

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:21 PM

పట్టణం లోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.

అర్జీలను గడువులోగా పరిష్కరించాలి: జేసీ
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న జేసీ విష్ణుచరణ్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పట్టణం లోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి బాధితులు అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ 332 అర్జీలు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలను అధికారులు గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీదా రులకు ఇచ్చే ఎండార్స్‌మెంట్‌ వారికి అర్థమయ్యేలా స్పష్టంగా ఇవ్వాల న్నారు. అర్జీలు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

Updated Date - Sep 01 , 2025 | 11:21 PM