Share News

అర్జీలను గడువులోపు పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:39 PM

అర్జీదారుల నుంచి వచ్చిన అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్‌ సిరి అధికారులను ఆదేశించారు.

అర్జీలను గడువులోపు పరిష్కరించాలి: కలెక్టర్‌
ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): అర్జీదారుల నుంచి వచ్చిన అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్‌ సిరి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య క్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడి టోరియంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువు లోగా పరిష్కరించేలా చర్యలు తీనుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎంవో గ్రీవెన్స్‌కు సంబంధించి ఆదోని సబ్‌కలెక్టర్‌ వద్ద 9, కర్నూలు ఆర్డీవో వద్ద 8, పత్తికొండ ఆర్డీవో వద్ద 2, కలెక్టరేట్‌ ఏవో వద్ద 3, జిల్లా రిజిస్ట్రార్‌, డీఎంహెచ్‌వో, డీఆర్డీఏ పీడీ, పంచాయతీరాజ్‌, ఏపీఐఐసీ జెడ్‌ఎంల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్‌లో ఉన్న వాటిని గడువు లోపు పరిప్కరించాలన్నారు. అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య కార్య క్రమాలను చేపట్టాలని, పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిం చలేదని ఫిర్యాదులు వస్తే సంబంధిత సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Sep 29 , 2025 | 11:39 PM