అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:59 AM
ప్రజల నుంచి వచ్చిన అర్జీల ను అఽధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి
బనగానపల్లె, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన అర్జీల ను అఽధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వి విధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి బీసీ వినతులను స్వీకరిం చారు. అప్పుటికప్పుడే కొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
పేదలకు వరం.. సీఎం రిలీఫ్ ఫండ్
పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. 69 మంది నిరుపేదలకు రూ.48.65 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. అత్యవసర వైద్యసేవల నిమిత్తం లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద రూ.4 లక్షల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధితులు సీఎం చంద్ర బాబు, మంత్రి బీసీ జనార్దనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ముస్లింల అభివృద్ధికి కృషి
సంజామల: ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన సంజామల గ్రామానికి చెందిన ముస్లిం మత పెద్దలు బనగానపల్లెలోని మంత్రి కార్యాల యంలో ఆయన్ను కలిసి వారి సమ స్యలను విన్నవించుకున్నారు. సంజామలలోని జామియా మసీదుకు సంబంధించిన 2.70ఎకరాల్లోని భూమిని రామ్‌కో రైల్వే లైన ఏర్పా టుకు పోయిం దన్నారు. ఇందుకు సంబంధించి రూ.33లక్షల పరిహారాన్ని రామ్‌కో సిమెంట్ వా రు అందజేశారని ఆమొత్తం నగదు వక్ఫ్‌బోర్డు స్వాధీనపరుచుకుందన్నారు. ఈ నగదును మసీదు కమిటీకి అప్పజెప్పాలని మంత్రిని కోరారు. పెండేకంటి కిరన కుమార్, మాబూ సాహేబ్, ఖాజా హుసేన, ఖాజా మొద్దీన, ఇస్మాయిల్, ఖలీల్, హుసేన బాషా, మాజీ ఎంపీటీసీ యూసుఫ్ హుసేన, మగ్బూల్ పాల్గొన్నారు.
కంబగిరిస్వామి ఆలయ ఆభివృద్ధికి కృషి
అవుకు: మండలంలోని ఎర్రమల కొండల్లో వెలసిన లక్ష్మీ కంబగిరి స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆది వారం ఆలయం ఈవో రామక్రిష్ణ, సిబ్బంది బనగానపల్లెలోని క్యాంపు కార్యాల యంలో మంత్రి బీసీని కలిశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.