అర్జీలను త్వరగా పరిష్కరించాలి: డీఆర్వో
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:17 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు 188 దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. ప్రతి ఫిర్యాదును జవాబుదారీతనంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పీజీఆర్‌ఎస్ అర్జీలతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు.