Share News

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:04 PM

పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశిం చారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్‌, అధికారులు

కలెక్టర్‌ ఏ.సిరి

కర్నూలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి పీజీఆర్‌ఎస్‌, పారిశుధ్య నిర్వహణ, యూరియా సరఫరా, ఉల్లి, హౌసింగ్‌, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు కోసం భూమి గుర్తింపు తదితర అంశాలపై మండల స్పెషల్‌ ఆఫీసర్లు, డివిజన్‌, మండల స్థాయి అదికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కోడుమూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో త్వరితగతిన భూమిని కేటాయించాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన అర్బర్‌-2 కు సంబంధించి రూపొందించిన అంగీ కార్‌-2025 పోస్టర్లను కలెక్టర్‌, అధికారులు ఆవిష్క రించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ డా.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:04 PM