పనితీరు మెరుగుపర్చుకోవాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:00 AM
పారిశుధ్య సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని కార్పొరేషన కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు.
కార్పొరేషన కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పారిశుధ్య సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని కార్పొరేషన కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. బుధవారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని సమా వేశ భవనంలో శానిటరీ ఇన్సపెక్టర్లు, కార్య దర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా స్మార్టన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగ నివారణ, చెత్త సేకరణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంపై చర్చించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని రాష్ట్రంలోనే స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలబెట్టేలా పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాల న్నారు. అలాగే ట్రేడ్ లైసెన్సు బకాయిల వసూళ్లలో ఆలస్యం చేయకూడ దన్నారు. కార్యక్రమలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమి షనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన సూపర్‌వైజర్ నాగరాజు, సీఎంఎం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.