Share News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 08 , 2025 | 12:58 AM

పహల్గాంలో పర్యాటకులను హతమార్చిన పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో విశ్వమోహన్‌, ఎస్‌ఐ మల్లికార్జున సూచంచారు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్‌ఐ

తుగ్గలి, మే 7 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో పర్యాటకులను హతమార్చిన పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో విశ్వమోహన్‌, ఎస్‌ఐ మల్లికార్జున సూచంచారు. బుధవారం మండలంలోని జొన్నగిరి గ్రామ కూడలి వద్ద ప్రజలకు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉందని, ఏమి జరిగినా ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని, కొత్త వ్యక్తులు, అపరిచితులపై నిఘా ఉంచి పోలీసులకు సమాచారం ఇవ్వాల న్నారు. సర్పంచ్‌ ఓబులేసు, డీటీ నాగరాజు, జియో మైసూరు కంపెనీ మేనేజర్‌ సోమిరెడ్డి రామ్మోహన్‌, ఆర్‌ఐ వెంకట్రాముడు, వీఆర్వో కాశీ, పంచాయతీ కార్యదర్శి నారాయణ స్వామి, రఘు ఉన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:58 AM