ఏడాది పాలనపై ప్రజల్లో సంతృప్తి
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:01 AM
: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
లక్ష్మీనగర్‌లో ‘తొలి అడుగు’
కర్నూలు అర్బన, జూలై 15(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. మంగళవారం సాయంత్రం నగరంలోని 24వ వార్డులోని లక్ష్మీనగర్‌లో ఆయన సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఏయే పథకాలు అందుతున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీజీ భరత మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయు డు వయస్సునుద్దేశించి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాఽధాక రమన్నారు. ఇప్పటికే ప్రజలు వీరికి 11 సీట్లు ఇచ్చారని, ఇలాంటి వైఖరి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో అవికూడా రావని అన్నారు.