పాలనపై ప్రజలు సంతృప్తి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:31 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
కల్లూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఆమె గురువారం కృష్ణానగర్‌లోని విఠల్ నగర్‌లో పర్యటించారు. ఉదయమే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేసి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. అంతేకాకుండా ప్రజలతో కలసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా విఠల్ నగర్ నుంచి గాయత్రి ఎస్టేట్ వరకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కాలనీ ప్రజలు ఎంపీని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె తప్పకుండా చేస్తామని హామీనిచ్చారు. మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది సమ్మెతో నీటి సమస్య ఏర్పడిందని స్థానికులు ఏకరువు పెట్టారు. వెంటనే ఎంపీ మున్సిపల్ డీఈ మనోహర్‌రెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎంపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లెల పుల్లారెడ్డి, రామిరెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.