సుపరిపాలనతో ప్రజలు హర్షం
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:51 AM
చంద్రబాబు సారథ్యంలో సాగుతున్న సుపరిపాలనతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
‘కుడా’ చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు అర్బన, జూలై 12(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు సారథ్యంలో సాగుతున్న సుపరిపాలనతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నగరంలోని 42వ డివిజనలో ఇనచార్జి తమ్మారెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నగర అధ్య క్షుడు నాగరాజు యాదవ్, నంద్యాల నాగేంద్ర, సోమిశెట్టి నవీన, సత్రం రామకృష్ణ, వలి, సురేఖ, విజయభారతి, షేక్ హనీముణ్ణి పాల్గొన్నారు.