దేశంలోకల్లా పింఛన్లు రాష్ట్రంలోనే అధికం
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:00 AM
దేశంలోకల్లా అధిక మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు పంపణీ చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
కర్నూలు న్యూసిటీ, మే 31(ఆంధ్రజ్యోతి): దేశంలోకల్లా అధిక మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు పంపణీ చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. శనివారం 48వ వార్డు అమీర్ హైదర్‌నగర్‌లో మంత్రి, నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబుతో కలిసి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ల నగదు సక్రమంగా జరుగుతుందా? లేదా? అని మంత్రి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి టీజీ భరత మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గడిచిన 11 నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుండా పక్కా ప్రణాళికతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన అందిస్తున్నామన్నారు. అమీర్ హైదర్‌నగర్‌లో మౌలిక వస తుల కల్పనకు తొలి దశలో రూ.1.54 కోట్లు కేటాయించి పనులు చేప డుతున్నామని అన్నారు. కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ నగరంలో ప్రతి నెల సుమారు 36 వేల మందికి రూ.16 కోట్ల పింఛన్లు పంపిణీకి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.