అర్హులందరికీ పింఛన్లు
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:14 PM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని కొత్తపేటలోని మంగలి వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకొని పింఛన్లు పంపిణీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఏవిధంగా పని చేస్తోందని మంత్రి అడగ్గా.. ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెప్పారు. అనంతరం వీధిలో ఉన్న సమస్యలను స్థానికులు మంత్రికి వివరించారు. అన్నింటిని పరిష్కరించాలని మంత్రి కమిషనర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, టీపీఆర్వో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ మన్జూర్‌బాషా, 50వ వార్డు ఇన్‌చార్జి బోయ మనీష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్
నగరంలోని 1వ వార్డు రామారావు గేట్‌లో కలెక్టర్ పి.రంజిత్‌బాషా పింఛన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ పి.విశ్వనాథ్, కార్పొ రేటర్ పి.షాషావలి, నగర పాలక అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు