ఇంటి వద్దకే పింఛన్
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:31 AM
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల డబ్బు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నామని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఓర్వకల్లు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల డబ్బు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నామని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నన్నూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. గ్రామంలో లక్ష్మమ్మ, సుంకన్న, ఆశమ్మ, సత్యం, వెంకటస్వామిలకు వృద్ధాప్య పింఛన్లు, లక్ష్మీదేవి, కుసుమ కుమారి, వెంకటలక్ష్మిలకు వితంతు పింఛన్లు, హనుమన్న, మద్దయ్యలకు వికలాంగ పింఛన్లు వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జూలై నెలలో జిల్లాలో అర్హులైన 2,36,640 మంది లబ్ధిదారులకు రూ.101.89 కోట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. అధికారులు సరైన సమయానికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారా? తెలుసుకున్నారు. అద్దె ఇంట్లో ఉన్నట్లయితే ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.3వేల నుంచి రూ.4వేలకు పింఛన్ పెంచిందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, డ్వామా పీడీ రమణయ్య, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ విద్యాసాగర్, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, స్థానిక నాయకులు విశ్వేశ్వరరెడ్డి, విజయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.