పెండేకంటి గణేశుడి లడ్డూ రూ.6.10లక్షలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:46 PM
వినాయక చవితి వేడుకలు అంటే కోలాహలం, సంబరాలే కాదు.. ముఖ్యంగా లడ్డూ వేలం కూడా. గణేష్ మండపాల్లో స్వామివారి చెంత ఉంచిన లడ్డు ప్రసాదాన్ని వేలంలో దక్కించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
వేలంలో దక్కించుకున్న కాంట్రాక్టర్
బనగానపల్లె, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి వేడుకలు అంటే కోలాహలం, సంబరాలే కాదు.. ముఖ్యంగా లడ్డూ వేలం కూడా. గణేష్ మండపాల్లో స్వామివారి చెంత ఉంచిన లడ్డు ప్రసాదాన్ని వేలంలో దక్కించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోనే బనగానపల్లె పట్టణంలోని పెండేకంటినగర్‌లో గణేశుడి లడ్డూ ప్రసాదాన్ని బుధవారం రాత్రి వేలం నిర్వహించారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో కాంట్రాక్టర్ గాలి సుదర్శన్ రెడ్డి రూ.6.10 లక్షలు దక్కించుకున్నారు. గతేడాది కూడా గాలి సుదర్శన్‌రెడ్డి గణేశుని లడ్డూ ప్రసాదాన్ని రూ.3.10లక్షలకు పాడి దక్కించుకున్నారు.