Share News

వేరుశనగ క్వింటం రూ.6,988

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:07 PM

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుశనగ ధరలు సోమవారం క్వింటం గరిష్ఠంగా రూ.6,988 పలికింది.

వేరుశనగ క్వింటం రూ.6,988
విక్రయానికి వచ్చిన వేరుశనగ దిగుబడులు

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుశనగ ధరలు సోమవారం క్వింటం గరిష్ఠంగా రూ.6,988 పలికింది. బోరు బావులు, కాలువల కింద సాగిన వేరుశనగ దిగుబడి చేతికందడంతో రైతులు విక్రయానికి తీసుకొస్తున్నారు. ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో కల్లాలలో ఆరబెట్టకుండా నేరుగా వేరుశనగను మార్కెట్‌కు తరలిస్తున్నారు. కాగా సోమవారం ఆదోని మార్కెట్‌కు 3,625 బస్తాల వేరుశనగ విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.3,266, గరిష్ఠ ధర రూ.6,988, సగటున ధర రూ.6,491 చొప్పున పలికింది

Updated Date - Aug 11 , 2025 | 11:07 PM