Share News

ప్రజల రుణం తీర్చుకుంటా

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:00 AM

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ఆర్‌అం డ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.

ప్రజల రుణం తీర్చుకుంటా
ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత మినరల్‌ వాటర్‌ ప్లాంటును ప్రారంభిస్తున్న మంత్రి బీసీ జనార్దన రెడ్డి

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి

బనగానపల్లె, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ఆర్‌అం డ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు. రూ.2 కోట్లతో నిర్మిం చిన సీసీ రోడ్లతోపాటు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సొంత నిధులు రూ.10లక్షలతో నిర్మించిన కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను మంత్రి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఆస్థానం రోడ్డు, లాల్‌మ సీదు, ఖాజీవాడ, గోపాల్‌నగర్‌లో నిర్మించి సీసీ రోడ్లు, అండర్‌ డ్రైనేజీ పనులను మంత్రి పారంభించారు. ఆయా వీధుల్లో ప్రజలతో మమేక మై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బనగాన పల్లె ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌ శాఖ కింద నియోజక వర్గంలో 150 పనులు చేపట్టామన్నారు. రూ.33కోట్లతో 31 పనులు పూర్తి చేశామన్నారు. 56 పనులు వివిధ దశల్లో ఉన్నాయ న్నారు. రూ.16 కోట్లతో మురుగునీరు జుర్రేరు వాగులో కలువకుండా ఎస్సార్బీసీ ప్రాజెక్టు నుంచి నేమఠం వరకు పనులు కొనసాగుతున్నాయన్నారు. భూగర్భ నీరు జుర్రేరులో కలవడం వల్ల మురుగునీరు బోర్లలో చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బనగానప ల్లెలో 166 పనులు జరుగు తున్నట్లు వెల్లడించారు. బీసీ వెల్ఫేర్‌, ఆర్‌డ బ్ల్యూఎస్‌, ఆర్‌ండ్‌బీ, నేషనల్‌ హైవే పనులు కూడా చేపట్టామన్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలు పారిపో యారన్నారు. రూ.13 లక్షల కోట్లు పెట్టుబ డులు పెట్టడానికి వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. చంద్ర బాబు విజినరీ లీడర్‌ అని మంత్రి ప్రశంసిం చారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, ఉపసర్పంచ బురాను ద్దీన, గౌండాబాబు, కాశీంబాబు, టంగుటూరు శ్రీనయ్య, నియాజ్‌ హుసేన, అల్తాఫ్‌ హుసేన, సలాం, అత్తార్‌ అబ్దుల్‌ కలాం, సర్పంచలు తులసిరెడ్డి, పాతపాడు మహేశ్వరరెడ్డి, మౌళీ శ్వరరెడ్డి, దొనపాటి భాస్క ర్‌రెడ్డి, సంగం శ్రీనివాసరెడ్డి, మీరాపురం నాగిరెడ్డి, డీఈలు నాగశ్రీని వాసులు, మధుసూదన, ఎంపీడీవో నాగరాజు, ఏఈ వెంకటరమణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సివిల్‌ సప్లై గోడౌన తనిఖీ చేసిన మంత్రి: బనగానపల్లె పట్టణం లోని సివిల్‌ సప్లై గోడౌనను మంత్రి బీసీ జనార్దనరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. గోడౌనలో బియ్యం, కంది పప్పు నాణ్యతను పరిశీలించారు. అనంతరం సమీపంలోని పాత తహసీల్దారు కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. కార్యాలయం దెబ్బ తినకుండా మరమ్మతులు చేపట్టాల ని అధికారులను మంత్రి ఆదేశించారు. పురాతన భవనాలు దెబ్బ తినకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట పంచాయతీరాజ్‌ డీఈ నాగ శ్రీనివాసులు, ఏఈ వెంకటరమణ ఉన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:00 AM