Share News

పత్తి ఓబులయ్యకు కళారత్న పురస్కారం

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:08 AM

రాష్ట్ర ప్రభుత్వం కళారంగంలో సుప్రసిద్ధ కళాకారులకు రాష్ట్ర స్థాయిలో ఏటా ఉగాది రోజున ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక కళారత్న(హంస) పురస్కారానికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య ఎంపికయ్యారు.

పత్తి ఓబులయ్యకు కళారత్న పురస్కారం
పత్తి ఓబులయ్య

ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉగాది రోజున సత్కరించనున్న సీఎం చంద్రబాబు

కర్నూలు కల్చరల్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కళారంగంలో సుప్రసిద్ధ కళాకారులకు రాష్ట్ర స్థాయిలో ఏటా ఉగాది రోజున ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక కళారత్న(హంస) పురస్కారానికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జున శుక్రవారం రాత్రి తెలియజేశారు. ఈ పురస్కారం కింద కళారత్న బిరుదుతోపాటు, హంస విగ్రహంతో సత్కరిస్తారు. అలాగే రూ.50 వేలు నగదు ప్రోత్సాహకం కూడా ఇస్తారు. 30న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఓబులయ్యను అవార్డుతో సత్కరిస్తారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఉగాది హంస పురస్కారానికి ఎంపికైన పత్తి ఓబులయ్య గత 50 ఏళ్లకు పైగా నాటక రంగానికి వివిధ రూపాల్లో సేవలు అందిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా తొలి హంస పురస్కారానికి ఎంపికైన తొలి జిల్లా కళాకారుడిగా నిలిచారు. పత్తి ఓబులయ్యకు కళారత్న (హంస) పురస్కారం లభించిన సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం కళాకారులతోపాటూ, జిల్లాకు చెందిన వివిధ కళాసంస్థల ప్రతినిధులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 29 , 2025 | 12:08 AM