రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:17 AM
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి కోరారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి
బనగానపల్లె, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి కోరారు. శనివారం బనగానపల్లె ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంత్రి బీసీ అధ్యక్షతన జరిగింది. మంత్రి బీసీ మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యశా లకు ధీటుగా బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తీర్చిదిద్దుతా మన్నారు. సమావేశంలో బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రధాన సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వ వైద్యులతో, కమిటీ సభ్యులతో మంత్రి చర్చించారు. ఆస్పత్రిలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత వంటి సమస్యలపై, అంశాలపై అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు, స్టాప్‌నర్సుల కొరత ఉందని మంత్రి దృష్టికి సూపరిం టెండెంట్ డాక్టర్ శైలజ, సూర్యకుమారిలు తీసుకెళ్లారు. మంత్రి ఆస్ప త్రిని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. సొంత నిధులతో ఆస్పత్రిలో ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈసమావేశంలో ఆర్డీవో నరసింహులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు టంగుటూరు శ్రీనయ్య, నియాజ్ హుసేన, ఫక్కూర్‌బీ, అహమ్మద్‌హుసేన, లలిత, తహసీల్దారు నారాయణరెడ్డి, డాక్టర్ రాఘ వేంద్రరెడ్డి పాల్గొన్నారు.
అంగనవాడీ కేంద్రం తనిఖీ: మండలంలోని ఇల్లూరు కొత్తపే టలోని అంగనవాడీ కేంద్రాన్ని మంత్రి బీసీ శనివారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో చాలామంది చిన్నారులు గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ పాఠశాలల్లో చిన్నారులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూపర్‌వైజర్లు, అంగన వాడీ కార్యకర్తలను ఆదేశించారు.