సీబీఎస్‌ఈ ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా పత్తికొండ విద్యార్థిని
ABN , Publish Date - May 13 , 2025 | 11:57 PM
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో పత్తికొండ పట్టణానికి చెందిన లాస్య రెడ్డి 496/500 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచి సత్తా చాటింది.
జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు
పత్తికొండ టౌన్/ కర్నూలు ఎడ్యుకేషన్, మే 12 (ఆంధ్రజ్యోతి): సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో పత్తికొండ పట్టణానికి చెందిన లాస్య రెడ్డి 496/500 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచి సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థాయి కాగా జాతీయ స్థాయిలో మూడోస్థానంలో నిలిచింది. పత్తికొండ పట్టణానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, శిరీషారెడ్డి దంపతుల మొదటి కుమార్తె లాస్యరెడ్డి కర్నూలులో శ్రీచైతన్య కట్టమంచి పాఠశాలలో సీబీఎ్‌సఈలో పదో తరగతి చదివింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఆలిండియాలో 500/496 మార్కులు సాధించి థర్డ్ ర్యాంకు, స్టేట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించింది. దీంతో తల్లిదండ్రులు టాపర్‌గా నిలిచిన కుమార్తెకు స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు. శ్రీచైతన్య పాఠశాల ఏజీఎం సురేష్‌బాబు, ఆర్‌ఐ రంగారెడ్డి, ప్రిన్సిపాల్ కిర్తి, డీన్ పవన్ కుమార్ తదితరులు విద్యార్థినిని అభినందించారు.
మంచి గుర్తింపు తీసుకువస్తా
నేను జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలవడం, తల్లిదండ్రుల సాకారం, శ్రీ చైతన్య పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయుల సహకారంతో 496 మార్కులు సాధించాను. భవిష్యతులో కంప్యూటర్ ఇంజనీర్ సైన్స్ విభాగంలో చేరి ఉన్నత చదువులు చదివి మంచి పేరు తెచ్చుకుంటాను. రాబోవు రోజుల్లో విద్యాపరంగా అన్ని అవకాశాలు అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటాను.
-లాస్యరెడ్డి