పసురపాడు వీహెచ్‌ఏ సస్పెన్షన్
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:10 AM
యూరియా అవకతవకలకు పాల్పడిన సంఘటనలో గోస్పాడు మండలం పసురపాడు రైతుసేవాకేంద్రం విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్(వీహెచ్‌ఏ) శ్రీకాంత్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగరాజు తెలిపారు.
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): యూరియా అవకతవకలకు పాల్పడిన సంఘటనలో గోస్పాడు మండలం పసురపాడు రైతుసేవాకేంద్రం విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్(వీహెచ్‌ఏ) శ్రీకాంత్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్ నుంచి గోస్పాడు మండలం పసురపాడు ఆర్‌ఎస్‌కేకు పంపిన యూరియా అక్కడికి చేరుకోకుండానే మాయం అయిన సంఘటనపై వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు విచారణ చేపట్టారన్నారు. విచారణలో ఆర్‌ఎస్‌కే కు చేరకుండానే కొంతమంది రైతులకు అందజేసినట్లు రుజువు కావడం, అందుకు సంబంధించి ఆర్‌ఎస్‌కేలో రికార్డుబుక్‌లో నమోదు చేయకపోవడం వంటి నిర్లక్ష్యపుపై కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాంత్‌రెడ్డిని సస్పెండ్ చేశామన్నారు. ఎవరైనా ఆర్‌ఎస్‌కేల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు సక్రమంగా రికార్డులు మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు.