Share News

గత జ్ఞాపకాలు మెరిసె.. మనసు విరిసె

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:51 PM

మండలంలోని యర్రగుంట్ల గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది.

గత జ్ఞాపకాలు మెరిసె.. మనసు విరిసె
గురువులతో పూర్వ విద్యార్థులు

శిరివెళ్ల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని యర్రగుంట్ల గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 1992-93 బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుని పాత జ్ఙాపకాలను నెమరువేసుకున్నారు. 33 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాలువా, పూల మాలలు వేసి జ్ఙాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:52 PM