Share News

సీమ అభివృద్ధిపై మహానాడులో తీర్మానం చేయాలి

ABN , Publish Date - May 29 , 2025 | 12:42 AM

కడపలో జరుగుతున్న మహానాడులో రాయలసీమ అభివృద్ధి, సంక్షేమంపై తీర్మానం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే ఆమలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

సీమ అభివృద్ధిపై మహానాడులో తీర్మానం చేయాలి
మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్శరరావు

నంద్యాల రూరల్‌ మే28 (ఆంధ్రజ్యోతి): కడపలో జరుగుతున్న మహానాడులో రాయలసీమ అభివృద్ధి, సంక్షేమంపై తీర్మానం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే ఆమలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. టీడీపీ ప్రజలకిచ్చిన హామీలను నేరవేర్చాలని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక కీలకమైన దశ, దిశను మహానాడులో ప్రకటించాలని అన్నారు. రాయలసీమకు నీటి వనరులు అందించే హంద్రీ, నీవా, గాలేరు, నగరి సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసేలా తీర్మానం చేయాలని కోరారు. అలాగే సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఆగస్టు 22 నుంచి 25 వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్‌లో 25, 26 వ తేదీల్లో చండీఘర్‌లో జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యవర్గ సభ్యులు రాయచంద్రయ్య, రామాంజనేయులు, రంగనాయుడు, బాబాఫకృద్దీన్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:09 PM