యోగాంధ్రలో భాగస్వాములు కావాలి: జేసీ
ABN , Publish Date - May 26 , 2025 | 11:35 PM
ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య అన్నారు.
ఓర్వకల్లు, మే 26(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య అన్నారు. సోమవారం యోగాంధ్ర క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని సోమయాజులపల్లె బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మ్యూజియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ నవ్య మాట్లాడుతూ జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర-2025 క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో యోగా కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం యోగా ట్రైనర్లు కార్యక్రమానికి హాజరైన వారితో ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు చేయించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయ, సెట్కూరు సీఈవో వేణుగోపాల్, డ్వామా పీడీ రమణయ్య, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ విద్యా సాగర్, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి, గ్రామ సర్పంచ్ జయమ్మ, నాయకులు కాకి దేవేంద్ర, శ్రీరామ శ్రీనివాసరెడ్డి, నాగమల్లేష్, ప్రతాప్, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.