Share News

పీ-4లో భాగస్వాములు కావాలి: జడ్పీ సీఈవో

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:43 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ-4లో అధికారులు, నాయ కులు భాగస్వాములు కావాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి పిలుపునిచ్చారు.

పీ-4లో భాగస్వాములు కావాలి: జడ్పీ సీఈవో
మాట్లాడుతున్న జడ్పీ సీఈవో నాసర రెడ్డి

నందవరం, సెప్టెంబరు 9 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ-4లో అధికారులు, నాయ కులు భాగస్వాములు కావాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి పిలుపునిచ్చారు. నందవరం మండల పరిషత కార్యాల యంలో మంగళవారం పీ-4పై అదనపు ఎంపీడీవో సందీప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జడ్పీ సీఈవో మాట్లాడుతూ మండలంలో 2,958 బంగారు కుటుంబాలను గుర్తించామని తెలిపారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేశాయి మాధవరావు మాట్లా డుతూ తాను ఓ కుటుంబాన్ని దత్తత తీసుకుని బంగారు కుటుంబంగా మలుస్తానని చెప్పారు. నందవరంలో అత్యంత పేదల జాబితా తయారు చేసి ఇవ్వాలని కోరారు. ఏపీ బీసీ కో- ఆపరేటివ్‌ ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్‌ డీవీ రాముడు, కాశీంవలి మాట్లాడుతూ అవగాహన కల్పిస్తే గ్రామ స్థాయి నాయకులు కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఐటీడీపీ తాలుకా అధ్యక్షుడు వీరేష్‌, ఆదిశేషు జబ్బార్‌, జనసే మండల అధ్యక్షుడు యల్లప్ప పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:43 AM