Share News

యువజనోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:45 PM

జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎ.సిరి సూచించారు.

యువజనోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సిరి

పోస్టరును ఆవిష్కరించిన కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎ.సిరి సూచించారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టరును శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 15 నుంచి 29 ఏళ్లలోపు యువ కళాకారులకు ఈ నెల 22వ తేదీన కర్నూలులోని రవీంద్ర మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఏడు విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలను రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి మొదటి స్థానంలో నిలిచిన విజేతలను జాతీయ స్థాయికి పంపనున్నట్లు తెలిపారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌ మాట్లాడుతూ పోటీలలో పాల్గొనే వారి పేర్లు, బందాల పేర్లను ఏ్ట్టఞట://ఛజ్టీ.జూడ/జుుఽజూఛీడజ25 ద్వారా నమోదు ద్వారా చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9292207601 ఫోన్‌ నెంబర్‌లో సంప్ర దించాలని సూచించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి లాలెప్ప, కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి శివరాముడు, సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 10:45 PM