Share News

ప్యాకెట్‌ పార్కు పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:32 AM

ఆనంద్‌ థియేటర్‌ సమీపంలోని హంద్రీ నది ఒడ్డున డంప్‌ తొలగించి నిర్మిస్తున్న ప్యాకెట్‌ పార్కు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నగర పాలక కమిష నర్‌ ఎస్‌.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ప్యాకెట్‌ పార్కు పనులు త్వరగా పూర్తి చేయాలి
పార్కు పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ రవీంద్రబాబు

నగర పాలక కమిషనర్‌ రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, జూన 10(ఆంధ్రజ్యోతి): ఆనంద్‌ థియేటర్‌ సమీపంలోని హంద్రీ నది ఒడ్డున డంప్‌ తొలగించి నిర్మిస్తున్న ప్యాకెట్‌ పార్కు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నగర పాలక కమిష నర్‌ ఎస్‌.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ప్యాకెట్‌ పార్కు పనులను పరిశీలించారు. కమిషనర్‌ మాట్లా డుతూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత ఆదేశాల మేరకు హంద్రీ నదిఒడ్డున ఉన్న డంప్‌ తొలగించామని, ఆ స్థానంలో రూ.10 లక్షలతో ప్యాకెట్‌ పార్కు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఫెన్సింగ్‌, గ్రావెల్‌ పనులు దాదాపు పూర్తి అయ్యాయని, పచ్చదనం పనులను త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ తెలి పారు. అంతకు ముందు కమిషనర్‌ వెంకటరమణ కాలనీ, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, హార్టికల్చర్‌ ఏడీ విజయలక్ష్మి, డీఈఈలు కృష్ణలత, గంగాధర్‌, టీఏఈలు మహేష్‌, మనోజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:32 AM