Share News

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 సర్వే

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:21 PM

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 సర్వే నిర్వహిస్తున్నట్లు ఇనచార్జి ఎంపీడీవో తాహిర్‌ హుసేన అన్నారు.

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 సర్వే
మాట్లాడుతున్న ఇనచార్జి ఎంపీడీవో తాహిర్‌హుసేన

చాగలమర్రి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 సర్వే నిర్వహిస్తున్నట్లు ఇనచార్జి ఎంపీడీవో తాహిర్‌ హుసేన అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులచే సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక ని ర్మూలన కోసం ప్రభు త్వం పీ-4 సర్వే చేపట్టిందన్నారు. ఆయా శాఖల ఉద్యోగులు పీ-4 సర్వేను ఇంటింటికి వెళ్లి కుటుంబ వివ రాలను నమోదు చేయాలన్నారు. బంగారు కుటుంబాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. స్వమిత్వ సర్వేను వేగవంతం చేయాల న్నారు. ఏవో రాజేంద్రప్రసాద్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:21 PM