Share News

జీజీహెచ్‌లో నిలువు దోపిడీ

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:54 AM

నంద్యాల జిల్లా ఆస్పత్రిలో అయిదేళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంఆర్‌ఐ, సిటీ స్కానర్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ ఎన్నారై అకాడమి ఆఫ్‌ సైన్స్‌ సంస్థకు కట్టబెట్టారు.

జీజీహెచ్‌లో నిలువు దోపిడీ
నంద్యాల జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఎం.ఆర్‌.ఐ. స్కానర్‌ , సిటీ స్కానర్‌

కోట్లాది రూపాయల విద్యుత్‌ బిల్లులు బకాయి

ప్రభుత్వం నుంచి దర్జాగా బిల్లులు చేసుకుంటున్న వైనం

ఎన్నారై అకాడమీ నుంచి బిల్లులు వసూలు చేసేదెవరు ?

గత వైసీపీ ప్రభుత్వం నుంచి రూపాయి కూడా చెల్లించని విద్యుత్‌ శాఖ

నంద్యాల హాస్పిటల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆస్పత్రిలో అయిదేళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంఆర్‌ఐ, సిటీ స్కానర్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ ఎన్నారై అకాడమి ఆఫ్‌ సైన్స్‌ సంస్థకు కట్టబెట్టారు. ఎమ్మారై, సిటీ స్కాన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు చెల్లించకపో వడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపం ప్రస్తుతం నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి చుట్టుకుంది. ఇప్పటి వరకు దాదాపు కోటి పదిహేను లక్షల రూపాయల విద్యుత్‌ బకా యిలు ఉన్నాయంటే అధికారుల పనితీరు ఇట్టే తెలుస్తోంది. ఎన్నారై అకాడమీ సంస్థకు చెల్లించా ల్సిన డబ్బును అప్పనంగా చెల్లిస్తున్నారేకాని విద్యుత్‌ బకాయిలు మాత్రం వసూలు చేసు కోవడంలో అధికారుల నిర్లక్ష్యానికి ప్రస్తుతం పేరుకుపోయిన విద్యుత్‌ బిల్లులే నిదర్శనమని చెప్పవచ్చు. నంద్యాల జీజీహెచ్‌లో ఎమ్మారై, సిటీ స్కాన్ల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్‌, సబ్‌ మీటర్‌ ఏర్పాటు చేశారు. సబ్‌ మీటర్‌లో వచ్చిన రీడింగ్‌కు యూనిట్‌కు రూ.10చొప్పున జీజీహెచ్‌ చార్జి చేస్తోంది. వైసీపీ హయాంలో ఎమ్మారై, సిటీ స్కాన్‌ నిర్వహణ వైసీపీ అనుయాయులకు కట్టబెట్టారు. ఎన్నారై అకాడమి ఆఫ్‌ సైన్స్‌ సంస్థ నుంచి నంద్యాలకు చెందిన ఓ మందుల దుకాణం యజమానికి ఏడు శాతం, ఆత్మకూరు వైసీపీ నాయకుడికి నలభై శాతం, నంద్యాలలోని ఓ వైద్యుడికి 53 శాతం వాటాతో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మారై, సిటీ స్కాన్ల నిర్వహణ దక్కించుకున్నారు.

దాదాపు మూడేళ్లు వీరు నిర్వహించగా అప్పట్లో కూడా విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. అనంతరం ఎన్నారై అకాడమే స్వయంగా వీటి నిర్వహణ ఇప్పటి వరకు చేస్తోంది. జీజీహెచ్‌కు ప్రతిరోజు దాదాపు 40 ఎమ్మారై స్కాన్లు, 60కిపైగా సిటీ స్కాన్లు చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు వెయ్యికిపైగా ఎమ్మారై స్కాన్లు, 1500కుపైగా సిటీ స్కాన్లు చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వం ఎమ్మారైకి రూ.2650, సిటీ స్కాన్‌కు రూ.1060 చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. గత అయిదేళ్లనుంచి ఒప్పందం ప్రకారం ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా ఎన్నారై అకాడమీ సంస్థ ఇప్పటి వరకు విద్యుత్‌ బిల్లు చెల్లించక పోవడం గమనార్హం.

నంద్యాల జీజీహెచ్‌ నుంచి పలుమార్లు విద్యుత్‌ బిల్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన ఎన్నారై అకాడమి ఆఫ్‌ సైన్స్‌ సంస్థ నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరించింది. 15-05-2019నుంచి 16-08-2019వరకు మూడు నెలల బిల్లు రూ.3,29,400 నోటీసు పంపారు. అలాగే 6-09- 2024నుంచి 12-11-2024వరకు రూ.4,01,600 విద్యుత్‌ బకాయిలున్నట్లు చివరగా నోటీసు పంపారు. ఎమ్మారై, సిటీ స్కాన్లు స్థాపిం చినప్పటి నుంచి 12-11-2024 వరకు మొత్తం విద్యుత్‌ బకాయిలు రూ.97,54,610 ఉన్నాయి. ప్రస్తుత ఆరు నెలలకు సంబంధించిన విద్యుత్‌ బకాయిలు దాదాపు రూ.15లక్షల వరకు ఉండ వచ్చని అంచనా. ప్రభుత్వ సంస్థ కాబట్టి విద్యుత్‌ అధికారులు కూడా బకాయిల వసూళ్లపై ఒత్తిడి తేవడంలేదని తెలుస్తోంది. ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన జీజీహెచ్‌కు నిరంతర విద్యుత్‌ ఇవ్వాలనేది విద్యుత్‌ అధికారుల ఆలోచన. అయితే ఇదే అదనుగా చేసుకొని ఎన్నారై అకాడమి కోట్లాది రూపాయలు గడిస్తున్నా విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోవడం పట్ల ఆస్పత్రి వర్గాలు మౌనంగా ఎందుకు ఉన్నాయన్నది చర్చనీయాంశమైంది.

ఒక రోజులలలలలలకకులలకకు చేస్తున్న పరీక్షలు

ఎంఆర్‌ఐ స్కాన్‌ 30 - 40

సిటీ స్కాన్‌ 60 - 70

రెండింటికి ప్రభుత్వం చెల్లించే డబ్బు

దాదాపు రూ.5లక్షలు

నెలకు విద్యుత్‌ బిల్లు దాదాపు రూ.2లక్షలు

నా దృష్టికి రాలేదు

జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్ల నిర్వహణ చేస్తున్న ఎన్నారై అకాడమీ ఆఫ్‌ సైన్స్‌కు బిల్లుల చెల్లింపు విషయం నా దృష్టికి రాలేదు. ఫిబ్రవరిలో జీజీహెచ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చార్జి తీసుకున్నాను. విద్యుత్‌ బకాయిల చెల్లింపు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటాం. - డా. మస్తాన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, జీజీహెచ్‌, నంద్యాల.

Updated Date - Apr 26 , 2025 | 12:54 AM